సారథి న్యూస్, హుస్నాబాద్: పాత వాహనాలను వేలం పాట వేయనున్నట్లు ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీల్లో అబాండెడ్ మోటర్ సైకిల్ అండ్ స్కూటర్లు 35, మహేంద్ర ట్రాక్టర్ ఒకటి, ఒక మారుతి కారు, ఒక టాటా ఏస్ ఆటో.. ఇలా మొత్తం 38 వెహికిల్స్ పట్టుబడినట్లు తెలిపారు. వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో వాటిని(అన్నోన్ ప్రాపర్టీ) కింద పరిగణించి ఈనెల 11న ఉదయ 10గంటలకు వేలం పాట వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంపాటలో పాల్గొని ఆయా వాహనాలకు వెంటనే డబ్బులు చెల్లించి తీసుకెళ్లొచ్చని ఏసీపీ పేర్కొన్నారు. సీఐ రఘుపతిరెడ్డి, సిద్దిపేట ఏఆర్ హెడ్ క్వార్టర్ ఆర్ఎస్ఐ ప్రదీప్, ఎంవీఐలను నియమించినట్లు తెలిపారు.
- December 7, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ACP MAHENDARREDDY
- HUSNABAD
- SIDIPETA
- UNKNOW PROPERTY
- అన్నోన్ ప్రాపర్టీ
- ఏసీపీ మహేందర్
- సిద్దిపేట
- హుస్నాబాద్
- Comments Off on 11న పాత వాహనాల వేలం