Breaking News

హెరాయిన్​తో పట్టుబడి..

కొలంబో: హెరాయిన్​తో పోలీసులకు పట్టుబడిన శ్రీలంక పేసర్ షెహన్ మదుషనకపై ఆ దేశ బోర్డు కొరడా ఝుళిపించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పిస్తూ సస్పెన్షన్ వేటువేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ‘ఓ అపరిచిత వ్యక్తితో కలిసి మదుషనక హెరాయిన్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మేం చర్యలు తీసుకున్నాం.

ఏ ఫార్మాట్లోనూ ఆడకుండా సస్పెండ్ చేశాం. అంతర్గత విచారణ పెండింగ్​లో ఉంది. దోషిగా తేలితే మరిన్ని కఠినచర్యలు తీసుకుంటాం’ అని లంక క్రికెట్ బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా వెల్లడించారు. 2018 జనవరిలో బంగ్లాదేశ్​తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మదుషనక హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. బంగ్లాపైనే రెండు టీ20లు ఆడాడు. తర్వాత గాయం కారణంగా టీమ్​కు దూరమయ్యాడు.