Breaking News

హాట్ స్పాట్ ఎత్తివేత

హాట్ స్పాట్ ఎత్తివేత
  • కరోనాను నియంత్రణలో భేష్
    – మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

సారథి న్యూస్, మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు సీఎం కేసీఆర్ చేసిన కృషికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. శుక్రవారం కలెక్టర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నిశాఖల అధికారుల కృషితోనే మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాలో కరోనా కేసులు అదుపులో ఉన్నాయని, యంత్రాంగం పనితీరుకు ఇదే నిదర్శనమన్నారు.

మర్కజ్ కు ముందే ఝార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల వారు సద్దలగుండు ప్రాంతంలో ఉన్నట్లు ముందుగానే గుర్తించి క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. దాదాపు పదివేల మందిని క్వారంటైన్ లో ఉంచితే వాటిలో 11మందికి పాజిటివ్ రాగా చికిత్స అనంతరం 9 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో ఇద్దరు మాత్రమే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అందుకు జిల్లా యంత్రాంగం ఎంతగానో శ్రమించిందని అభినందించారు. నేటినుంచి రాజేంద్రనగర్ హాట్ స్పాట్ ను తొలగిస్తున్నామని, రెండు రోజుల్లో మరో హాట్ స్పాట్ ను ఎత్తేస్తామన్నారు. జిల్లాల్లో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తిచేశారు. నారాయణపేటలో వచ్చిన పాజిటివ్ కేసు ఆ బాబుకు హైదరాబాద్ లో సోకి ఉండొచ్చని, గ్రామంలో ఎవరికీ కరోనా లక్షణాలు రాలేదని స్పష్టంచేశారు. హైదరాబాద్ , కర్నూలు, గద్వాల ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని, వెళితే మళ్లీ ఇక్కడికి రానివ్వబోమని ఆయన హెచ్చరించారు.