సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్చైర్మన్వెంకటేశ్, కమిషనర్మదన్మోహన్గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు అల్లా బకాష్, మోహన్ రెడ్డి, వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు.
- June 25, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- ALAMPUR
- JOGULAMBA
- అలంపూర్
- జోగుళాంబ
- హరితహారం
- Comments Off on హరితహారం స్వర్ణహారం కావాలి