Breaking News

హత్రాస్​ ఘటన బాధ్యులను వదలొద్దు

సారథి న్యూస్ రామడుగు: హత్రాస్​​లో దళిత యువతిపై లైంగికదాడి చేసి ఆమె మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాడే శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన రామడుగులో విలేకరులతో మాట్లాడారు. యూపీలో జరిగిన ఘటన నిరంకుశ పాలనకు నిదర్శనమని శంకర్ మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సయిండ్ల నర్సింగం, మండల పార్టీ ప్రెసిడెంట్ బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, కడారి రాజేశం, బాబు రాజు, నీలం దేవకిషన్, మొలుగూరి రాజశేఖర్ పాల్గొన్నారు.