![స.హ.చట్టం మీడియా కన్వీనర్ గా సాయిబాబు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/acpt-sai-2.jpg?fit=160%2C200&ssl=1)
సారథి న్యూస్, అచ్చంపేట: సమాచార హక్కు రక్షణ చట్టం (2005) అచ్చంపేట మండల కమిటీ మీడియా కన్వీనర్ గా రేసోజు సాయిబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భోగరాజు ప్రశాంత్, జిల్లా అధ్యక్షుడు కృష్ణప్రసాద్, మండలాధ్యక్షుడు పోల స్వామి నియామక పత్రం అందజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మీడియా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీకి సాయిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.