Breaking News

స్వయంగా కంపోజ్​

స్వయంగా కంపోజ్​

శేఖర్ కమ్ముల డైరెక్షన్​లో వస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్​గా నటిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో నటించే సాయి పల్లవికి డ్యాన్సర్​గా కూడా మంచి పేరు ఉంది. ‘ఫిదా’ సినిమాలో ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అన్న పాటకు ఒక రేంజ్​లో వేసిన పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ‘సింగిల్ పీస్’ అంటూ భానుమతిగా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు శేఖర్ ఇంకో ఆఫర్ ఇచ్చాడట. ‘లవ్ స్టోరీ’ సినిమా లో షూట్ చేయాల్సినవి ఇంకొన్ని సీన్లే ఉన్నాయట. వాటిలో సాంగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందట. ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చెయ్యమని పల్లవిని కోరాడట శేఖర్. అయితే ఈ పాటలో పల్లవి కూడా స్టెప్పులెయ్యాలి. తన పాటకు తనే కంపోజ్ చేసుకోవడం అన్న విషయం అభినందించదగ్గదే. దానికి సాయి పల్లవి కూడా ఒప్పుకుందని సమాచారం. దీంతో డ్యాన్స్ తో అలరించే పల్లవి కొరియోగ్రాఫర్​గా కూడా రాణించనుందేమో అంటున్నారు.