లండన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ ఇచ్చి చెడగొట్టవద్దని మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. సారథ్యం వల్ల అధిక ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇది ఆటతీరుపై చాలా ప్రభావం చూపుతుందన్నాడు. ‘ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టోక్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగించొద్దు. తద్వారా అతనిలో ఆందోళన పెరుగుతుంది.
చాలా రోజుల తర్వాత క్రికెట్ మొదలవుతుంది. కాబట్టి కొత్త ప్లేయింగ్ కండీషన్స్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటివల్ల అధిక ఒత్తిడి ఉంటుంది. అందుకే స్టోక్స్‌ను ప్లేయర్‌గా వదిలేయాలి. నా ఉద్దేశం ప్రకారం బట్లర్‌కు సారథ్య పగ్గాలు ఇవ్వాలి’ అని పీటర్సన్ పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచి ప్రత్యామ్నాయమని చెప్పాడు.