Breaking News

సోను మరో సాయం.. స్కాలర్​షిప్​

సోను మరో సాయం

కరోనా పుణ్యమా! అని సోను పేదల పాలిట సూపర్ హీరో అయిపోయాడు. విలన్ పాత్రలు చేసే సోనూ సూద్ రియల్ లైఫ్ లో వాళ్లలోటును తీరుస్తూ ఆత్మీయుడిగా అభిమానాన్ని సంపాదించాడు. కోట్ల రూపాయలను సమాజసేవకు వినియోగిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. సాయం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే క్రమంలో సోనూ తాజాగా మరో నిర్ణయాన్ని ప్రకటించాడు. తెలివైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో వారికి స్కాలర్ షిప్ అందిస్తానని ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాడు.

దానికి కారణం తాను ఓ సాధారణ టీచర్ కొడుకునని.. తన తల్లి దగ్గరకు ఎందరో పేద పిల్లలు సాయం కోసం వచ్చేవారని.. అప్పుడు చేయలేని సాయం ఇప్పుడు చేస్తానని అంటున్నాడు. దానికి తగినట్టు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించాడు. దేశ వ్యాప్తంగా ఉన్న పేద ప్రతిభావంతులైన విద్యార్థులు.. కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా సాయం కోసం తనకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అంటూ తెలియజేశాడు. అయితే వారికి కుటుంబం వార్షికాదాయం రూ.రెండు లక్షలు దాటకుండా ఉండాలి. అలాగే చదువులో మంచి ప్రతిభ చూపిన వారై ఉండాలని కండిషన్స్​పెట్టాడు. అలాంటి వారికి కచ్చితంగా చదువుతో పాటు వసతి, భోజన సదుపాయాలను తానే కల్పిస్తానంటూ హామీఇచ్చాడు. ఏడాదిలో రెండొందల నుంచి మూడొందల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చే ఉద్దేశంతో సోను సూద్ నిధులు సమకూర్చుతున్నట్టు సమాచారం. ఇది అప్లికేషన్​ ఫార్మాట్​..

Dear Sonu Sood Sir,
Subject – Applying For Scholarship

Name –
Education –
Percentage –
Adress –
Father’s Name –
Father’s Annual Income –
E-Mail Id –
Mobile No. –

Thanking You..
Eagerly Waiting For Your Response

Mail Id – Scholarships@sonusood.me