జైపూర్: భారత్‌కు చెందిన రహస్య సమాచారానిన దాయాది దేశమైన పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఇద్దరు సైనికాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ డిఫెన్స్ ఆఫీసర్లు వికాస్ కుమార్ (29), చిమల్ లాల్ (22) శ్రీనగర్ జిల్లాలో ఉన్న ఆర్మీ మందుగుండు సామగ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. వీరిద్దరూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేస్తున్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై ఆఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేసినట్టు ఇంటెలిజెన్స్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేశ్ మిశ్ర తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి కుమార్ అనే వ్యక్తిని ఆగస్టులో అరెస్టు చేసినట్లు చెప్పారు. ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో చాట్ చేసి వాళ్లను ట్రాప్ చేసినట్లు సమాచారం. అరెస్టు చేసిన ఇద్దర్ని స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు
- June 9, 2020
- జాతీయం
- షార్ట్ న్యూస్
- INDIAN ARMY
- PAKISTAN
- TRAP
- శ్రీనగర్
- సైనికాధికారులు
- Comments Off on సైనికాధికారుల దుశ్చర్య