అహ్మదాబాద్: గుజరాత్‌లో త్వరలో రాజ్యసభ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్ చేయడంతో రెండు సీట్లు రావాల్సిన చోట ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉండడంతో వాళ్లందరినీ సేఫ్ జోన్‌గా భావించిన రాజస్థాన్‌లోని ఓ రిసార్టుకు తరలించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్నందున అక్కడ అయితే సేఫ్ అని వాళ్లను అక్కడికి తరలించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొంతమందిని రిసార్టుకు తరలించగా.. ఆదివారం సాయంత్రం 26 మందిని తరలించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు గుజరాత్‌లో ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గుజరాత్‌లో ఈ నెల 20న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే రూలింగ్ బీజేపీ ముగ్గురు సభ్యులను బరిలోకి దించింది. గుజరాత్‌లో ఒక్కో కేండిడేట్‌కు కనీసం 34 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉండాలి. కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ బలం 66కు చేరుకుంది. దీంతో కాంగ్రెస్ రెండో సీటు గెలవడం కష్టంగా మారింది.