కండలవీరుడిగా ప్రశంసించుకోవడం ఇష్టం ఉండదేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ ఒంటిమీద చొక్కా లేకుండా దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ లాక్ డౌన్ మహేష్ ను అలా చూసేందుకు వీలు కల్పించింది. తన చిన్నారి సితారతో స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అవుతోంది. షూటింగ్ వాయిదాల వల్ల ఇంటికే పరిమితమైన మహేష్ తన ఫొటోలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత పరుశరామ్ డైరెక్షన్లో సినిమా చేసేందుకురెడీ అవుతున్నాడు మహేష్. తర్వాత రాజమౌళితో కూడా మరో సినిమా చేయనున్నాడు.
- May 19, 2020
- సినిమా
- MAHESHBABU
- SITARA
- SUPERSTAR
- పరుశరామ్
- సరిలేరు నీకెవ్వరు
- Comments Off on సూపర్‌స్టార్ ఇలా..