‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత మరోసారి థ్రిల్లర్ కంటెంట్ తో మెప్పించే ప్రయత్నంలో ఉన్న సుమంత్ ‘కపటదారి’ అనే ఎమోషనల్ థ్రిల్లర్ తో రానున్నాడు. విజయ్ ఆంటోనితో ‘సైతాన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు. ధనుంజయన్ నిర్మాత. లాక్డౌన్ సడలింపులతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు సుమంత్. షూటింగ్ పూర్తయిందని చెప్పిన సుమంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టంచేశాడు.
లాస్ట్ ఇయర్ కన్నడలో విజయం సాధించిన ‘కవలుదారి’ సినిమాకు ఇది రీమేక్. తెలుగులో సుమంత్ హీరోగా నటిస్తుండగా.. తమిళంలో సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ హీరోగా రెండు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. నందితాశ్వేత, నాజర్, జయప్రకాష్, సుమన్ రంగనాథన్ రెండు భాషల్లోనూ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ మూవీ తెలుగులోనూ హిట్ సాధిస్తుందని భావిస్తున్నాడు సుమంత్. మరి అదే మేజిక్ రిపీట్ అయి సుమంత్ లక్ తిరగనుందేమో చూడాల్సిందే.