Breaking News

సీఎం సహాయ నిధి వరం

సీఎం సహాయ నిధి వరం

సారథి న్యూస్, చొప్పదండి: పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయక నిధి కింద రూ.3,20,500 మొత్తాన్ని చెక్కుల రూపంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వారికి ఇది వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవిందర్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సంబన్న ,టీఆర్ ఎస్ అధ్యక్షుడు బంధారపు అజయ్ కుమార్, చుక్కారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.