సారథి న్యూస్, సూర్యాపేట: సీఎం కేసీఆర్ సంకల్పం మేరకే డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో 82 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అలాగే 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విధిగా అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ దీపిక పాల్గొన్నారు.
- May 28, 2020
- నల్లగొండ
- లోకల్ న్యూస్
- CM KCR
- SURYAPET
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
- మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
- Comments Off on సీఎం సంకల్పం మేరకే ఇళ్లు