సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్లో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో వేల్పుల నందు, రావుల రాజేష్, రాంబాబు, నవీన్, చిన్ని, సాయిబాబా, మైదం వేణు, మైదం రవి తదితరులు పాల్గొన్నారు.
- September 11, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CM KCR
- REVENUE ACT
- WARANGAL
- తెలంగాణ
- రెవెన్యూచట్టం
- వరంగల్
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం