సారథి న్యూస్, నాగర్కర్నూల్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా సోమవారం పాన్ గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లితండా, తెల్లరాళ్లపల్లిలో వంద పేదకుటుంబాలకు 25 కేజీల బియ్యం, పప్పు నూనె, ఇతర నిత్యావసర సరుకులను పార్టీ నాయకుడు రాజునాయక్ తన సొంత ఖర్చులతో సమకూర్చగా.. సోమవారం వాటిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. వెంగళాయపల్లి, జమ్మాపూర్, బండపల్లి గ్రామాల ప్రజలకు కరోనా నివారణపై అవగాహన కల్పించారు. వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రజలు కచ్చితంగా లాక్ డౌన్ ను పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.