Breaking News

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉమ్మడి నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్​ విషెస్​
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలిలోకి కవిత రాకతో మహిళా సమస్యలు మరింత పరిష్కారమవుతాయని అన్నారు.

స్పీకర్​ను కలిసిన కవిత
నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించిన కల్వకుంట్ల కవిత సోమవారం అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చి కలిశారు. ఆమెను స్పీకర్​ పోచారం కుటుంబసభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆమె వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల జడ్పీ చైర్మన్లు దాదన్న విఠల్​రావు, శోభరాజు ఉన్నారు.