సౌత్ నుంచి వచ్చి ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘కేజీఎఫ్’ మూవీ భారీ వసూళ్లతో పాటు భారీ ప్రశంసలూ అందుకుంది. అలాగే ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం అభిమానులు అంతగానే ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మొదటి భాగంలో రాఖీభాయ్ హీరోయిజాన్ని ఎంతలా పెంచుకుంటూ పోయాడో సెకండ్ చాప్టర్ లోనూ విలన్ అంతగా చూపించనున్నాడట. దానికోసం అధీరా అనే మెయిన్ విలన్ పాత్రకి బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పటికే రఫ్ ఎడిటింగ్ పూర్తయినట్టు క్లారిటీ ఇచ్చారు.
ఈ వెర్షన్ లో సంజయ్ దత్ పై తీసిన సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటూ ఎంతగానో హైలెట్ అవుతాయని, అధీరా క్యారెక్టర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే హీరోయిజం అంత ఎక్కువ ఎలివేట్ అవుతుందనే సూత్రాన్ని ప్రశాంత్ నీల్ కూడా పాటిస్తున్నాడు అనేందుకు మొదటి భాగమే సాక్ష్యం. అందుకే ఇప్పుడు అధీరా లాంటి క్రూరుడైన విలన్ కి దీటుగా ఎదురించే రాఖీ భాయ్‌గా యశ్ క్యారెక్టర్ లో రెట్టింపు హీరోయిజాన్ని చూపించబోతున్నాడట. మొత్తానికి ‘కేజీఎఫ్’ సినిమా ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే అసలు సినిమా చాప్టర్ 2 నే అంటూ… పిక్చర్ అభీ బాకీ హై అంటూ సీక్వెల్ పై అంచనాలు పెంచేశారు. ప్రభుత్వం అనుమతిస్తే మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేసి దసరాకి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఎప్పుడొస్తుందని కాదు, ఎలా ఆడుతుందనేది చూడాలంటున్నారు అభిమానులు. మరి రాకీ భాయ్ ఈ సినిమాతో ఇంకెంత రఫ్ ఆడించనున్నాడో చూడాల్సిందే.