సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని మార్కెట్, న్యూ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన కూరగాయల, మటన్ మార్కెట్ తో పాటు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చేపల మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి పరిశీలించారు.
అమ్మకాలు జరిపే వారు తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు.