సారథి న్యూస్, కల్వకుర్తి: అగ్రకుల రాజకీయ నాయకులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని మనోవేదనకు గురై ఆత్మహత్యయత్నానికి పాల్పడిన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ సర్పంచ్ చింత ఝాన్సీని శుక్రవారం తెలంగాణ మాలమహానాడు నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ.. అగ్రకులస్తులైన ఆనంద్ రెడ్డి, నరసింహారెడ్డి, సాయిబాబా, గ్రామ కార్యదర్శి రామస్వామి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఆమెను పరామర్శించిన వారిలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడం బాల్రాజ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, రాష్ట్ర కార్యదర్శి పంబల సుధాకర్, రాష్ట్ర నాయకులు సామ బంగారయ్య, వంగూరు మండలాధ్యక్షుడు దొడ్డి విష్ణు, గౌరవాధ్యక్షుడు అంతయ్య, శ్రీనివాసులు ఉన్నారు.
- September 25, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MALAMAHANADU
- RANGAPUR
- SURPUNCH JHANSI
- VANGUR
- మాలమహానాడు
- రంగాపూర్
- వంగూరు
- Comments Off on సర్పంచ్ ఝాన్సీని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి