సారథి న్యూస్, హుస్నాబాద్: తోటి ప్రజాప్రతినిధిని కులం పేరుతో దూషించిన ఓ సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లి గ్రామంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ బానోతు ప్రమీళ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ సృజనకు ఎంపీటీసీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన సర్పంచ్.. ఎంపీటీసీని కులం పేరుతో దూషించింది. సర్పంచ్‌తోపాటు ఆమె భర్త వంగపల్లి సంపత్‌కుమార్, అత్త అచ్చవ్వ, ఉప సర్పంచ్ భర్త గుళ్ల సంపత్, కూడా ఆమెను కులంపేరుతో దూషించారు. దీంతో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సర్పంచిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొత్తపల్లి రవి పేర్కొన్నారు.
- July 12, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- Comments Off on సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు