Breaking News

సరి‘హద్దు’ దాటుతోన్న కలప

సారథి న్యూస్​, నారాయణఖేడ్​: ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం పదేపదే చెబుతోంది.. హరితహారం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కానీ కొందరు వ్యాపారులు, ఫారెస్ట్ ఆఫీసర్లు కుమ్మకై చెట్లను ఇష్టారీతిలో అడవులను నరికేస్తున్నారు. ప్రతిరోజూ లారీలు, ట్రాక్టర్లలో లోడ్ చేసి పొరుగు రాష్ట్రాలు దాటించేస్తున్నారు. కంగ్టి, కల్హేర్, మనూర్ ఉమ్మడి మండలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తున్నారు.

కంగ్టి మండలం నుంచి ప్రతిరోజు ఐదు నుంచి పది ట్రాక్టర్ల కలప అక్రమంగా రవాణా సాగుతోంది. ఇక్కడ పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు కమిట్ మెంట్ కు వచ్చి వారు డిమాండ్ చేసిన డబ్బులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సమీప పొలాల రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.