సారథి న్యూస్, వనపర్తి: చారిత్రక సరళాసాగర్ ప్రాజెక్టు గండి పూడ్చివేత, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళవారం ప్రాజెక్టును మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పున:ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31న ప్రాజెక్టుకు గండిపడడంతో నీరతా వృథాగాపోయింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లడంతో ప్రకృతి విపత్తుల నిధుల నుంచి రూ.ఆరుకోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. మే నెలలో డిజైన్ ఇచ్చి అధికారులు పనులను మెగా కంపెనీకి అప్పగించారు. వెంటనే వారు పనులు ప్రారంభించారు. సుమారు వందమీటర్ల పొడుగు కట్ట పునర్నిర్మాణం చేశారు. కోర్ వాల్ నిర్మించారు. గ్రౌంటింగ్, బ్యాంకింగ్ పనులు చేశారు. రివిట్మెంట్, రిటైనింగ్ వాల్ స్క్రీన్ వాల్ తదితర పనులు చేపట్టారు. అయితే వనపర్తి రాజుల నాటి చారిత్రాత్మక, 4,600 ఎకరాలకు సాగునీరు అందించే సరళాసాగర్ ప్రాజెక్టుకు గండిపడడం రాజకీయ దుమారం రేపింది. గండి పునర్నిర్మాణంపై విపక్షాల విమర్శలు, అధికారపక్షం ప్రతి విమర్శలు జోరుగా సాగాయి. ఎట్టకేలకు ప్రాజెక్టు పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది.
- July 20, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CM KCR
- MEGA COMPANY
- SARALASAGAR
- వనపర్తి
- సరళాసాగర్
- సీఎం కేసీఆర్
- Comments Off on సరళాసాగర్ పనులు పూర్తి