న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఆగిపోయిన క్రీడా కలపాలన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రేక్షకులకు అనుమతించే ధైర్యం ప్రభుత్వాలు చేయలేకపోతున్నా.. వియత్నాం మాత్రం దీనికి అతీతంగా నిలిచింది. దేశవాళీ ఫుట్‌బాల్ లీగ్‌కు ప్రేక్షకులను అనుమతించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోచిమిన్ సిటీలో జరిగిన వీ–లీగ్ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. మూడు మ్యాచ్‌లకు దాదాపు 30వేల మంది హాజరయ్యారు. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. అయితే ఏ ఒక్కరు కూడా మాస్క్‌లు కట్టుకోలేదు. భౌతిక దూరం పాటించలేదు. అభిమానుల మధ్యలో మ్యాచ్ ఆడడం చాలా ఆనందాన్ని ఇస్తుందని హోచిమిన్ జట్టు కోచ్ జంగ్ హు సంగ్ అన్నాడు. దీనిని ఇలాగే కొనసాగించాలన్నాడు.
- June 7, 2020
- క్రీడలు
- FOOTBALL
- VIETNAM
- కరోనా
- వియత్నాం
- హోచిమిన్ సిటీ
- Comments Off on సందడి మొదలైంది