Breaking News

సంక్రాంతి వేళ ఏపీకి స్పెషల్​ బస్సులు

సంక్రాంతి వేళ ఏపీకి స్పెషల్​ బస్సులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు3,380 ప్రత్యేక బస్సులను, ఏపీకి 1,600 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్(సీబీఎస్), ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఎల్, కేపీహెచ్​బీ కాలనీ, ఎస్ఆర్ నగర్, అమీర్​పేట, టెలిఫోన్ భవన్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విజయ నగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నరసాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయ గిరి, కనిగిరి, కందూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. పండుగ వేళ ప్రయాణికుల రద్దీదృష్ట్యా ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరప్రసాద్ తెలిపారు.