Breaking News

షకీలా సినిమా.. క్లీన్ యూ

అటు షకీలా సినీప్రస్థానంలో కానీ, ఇటు సాయిరామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం ‘జగన్ అన్న’ అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎలాంటి కట్లు, మ్యూట్లు లేవు, అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది, తన ప్రతి సినిమా రిలీజ్​కు ముందు ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి ఎక్కే సాయిరామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు. ఈ సినిమాకు సీహెచ్ వెంకట్ రెడ్డి నిర్మాత. లండన్ గణేష్ సహానిర్మాత. మధు పొన్నస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన బాణీలు అందించిన పాటలు విడుదలయ్యాయి. రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సంపూర్ణంగా కుటుంబ కథాచిత్రం అని, ఇది నేరుగా ఓటీటీలో విడుదల చేయాలా లేక సినిమా హాల్ లో విడుదల చేయాలా? అనే విషయంలో ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని సాయిరామ్ దాసరి తెలిపారు. త్వరలో పూర్తివివరాలు వెల్లడిస్తామని తెలిపారు.