Breaking News

శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

శ్రీశైలం వద్ద కృష్ణవేణి పరవళ్లు

సారథి న్యూస్, కర్నూలు: భారీవరద రావడంతో శ్రీశైలం రిజర్వాయర్​ జలకళను సంతరించుకుంది. అధికారులు గురువారం ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగులకు గాను 880 అడుగుల మేర నీటినిల్వ ఉంది. రిజర్వాయర్​ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా, 196 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.