Breaking News

శ్రీలంక టూర్​ క్యాన్సిల్​

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్​లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్​లను భవిష్యత్​లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్‌, జులైలో జరగాల్సిన లంక టూర్​ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం టీమిండియా ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించడానికి క్రికెటర్లకు ఆరు వారాల సమయం పడుతుంది. పైగా అంతర్జాతీయ ప్రయాణ నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. అందువల్ల ఈ పర్యటనను మేం రద్దు చేసుకుంటున్నాం’ అని ధుమాల్‌ వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని లంక బోర్డు కూడా ధ్రువీకరించింది.