బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మనవరాలైన సాయేషా సైగల్ ‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన ‘శివాయ్’ మూవీలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ చాలా తమిళ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను గతేడాది వివాహం చేసుకుంది. హీరోయిన్గా కోలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఆర్యతో ప్రేమలో పడడం.. వెంటనే పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. కానీ పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానలేదు సాయేషా. ప్రస్తుతం ఆమె తమిళం, కన్నడ రెండు చిత్రాల్లో నటిస్తోంది. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సాయేషా సోషల్ మీడియాతో టచ్ లో ఉంటూ తన డ్యాన్స్ వీడియోలతో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. సాయేషా స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్. తాను సంప్రదాయ బద్ధంగా డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో క్లాసికల్ మూమెంట్స్ తో అదరగొట్టింది. ఆమె డ్యాన్స్ వీడియోను వైరల్ చేస్తూ అభిమానులు అద్భుతంగా చేశావంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
- May 18, 2020
- సినిమా
- AKHIL
- DILIPKUMAR
- SAYESHA
- అజయ్ దేవగణ్
- ఆర్య
- కోలీవుడ్
- Comments Off on శభాష్ సాయేషా!