సారథి న్యూస్, గోదావరిఖని: పారిశుద్ధ్య నిర్వహణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పరిసరాలను శుభ్రంచేశారు. గార్డెన్ లో చెత్తను తీసివేయడంతో పాటు నిలువ ఉన్న నీటిని పారబోశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు. వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
- June 7, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MLA DASARI
- PEDDAPALLY
- పారిశుద్ధ్యం
- మంత్రి కేటీఆర్
- Comments Off on వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి