సారథి న్యూస్, బిజినేపల్లి: కోవిడ్ 19 విధులు నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎండీ పసియోద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. డ్యూటీలో ఉండి కరోనాతో మరణించిన ఉద్యోగికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 10శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్చేయాలని, 108 సర్వీసులో పనిచేస్తున్న సిబ్బందికి 12 గంటల డ్యూటీని ఎత్తివేసి 8 గంటల పనిదినాలు అమలుచేయాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పర్వతాలు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుగుణ, పద్మ, హైమావతి, రమేష్, ముత్యాలు పాల్గొన్నారు.
- September 22, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BIJINEPALLY
- COVID19
- MEDICAL EMPLOYEES
- REGULARISE
- కోవిడ్–19
- బిజినేపల్లి
- వైద్య ఉద్యోగులు
- Comments Off on వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి