ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి.
ఈ వేసవిలో ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటాయి. ఆరోగ్యపరంగా వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.
*హిమోగ్లోబిన్‌శాతం చెక్‌చేసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్నవారు ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టమవుతోంది. – అధిక బరువు ఉన్నవారు కనీసం 3 నుంచి 5 కిలోల బరువు తగ్గాలి. బరువు ఎక్కువ ఉన్నవారిలో అధిక వేడి వల్ల రాషెస్‌ఎక్కువగా వస్తాయి. తక్కువ బరువు ఉన్నవారు. 2 నుంచి 3 కిలోలు పెరగాలి. లేదంటే వీరికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వేసవికాలలో కాటన్ దుస్తులు తప్పనిసరిగా వాడాలి.–సమ్మర్లో హైడ్రేట్‌గా ఉంటుంది. బయటకు వెళ్లేప్పుడు నీళ్ల బాటిల్వెంట తీసుకుని వెళ్లాలి. ఉదయం 9 కల్లా ఆఫీస్‌లకు, వ్యాపారలాకు వెళ్లడం, సాయంత్రం 5‒6 తర్వాతే బయటకు రావడం చేయాలి. ఈ విధంగా చేస్తే వడదెబ్బ బారిన పడరు.
*ఏసీ గదుల్లోంచి వెంట వెంటనే ఎండలోకి రాకూడదు. ఏసీ గది నుంచి ముందుగా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న గదిలోకి వచ్చి, తర్వాత ఎండలోకి వెళ్లాలి. దీనినే ‘క్లయిమటైజేషన్’ అంటారు. హఠాత్తుగా ఉష్ణోగ్రతల మార్పు వల్ల రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. బయటి నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగొద్దు. 5 నిమిషాలు ఆగిన తర్వాత తాగాలి.
*ఎండలకు నిమ్మరసం కలిపిన మజ్జిగ దివ్యౌషధం మాదిరిగా పనిచేస్తుంది. మజ్జిగలో ఉన్న కాల్షియం, ఉప్పులో ఉండే సోడియం, నిమ్మరసంలోని పొటాషియం వడదెబ్బ నుంచి రక్షించడమే కాకుండా శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో పండ్ల రసాలు, సూప్స్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు.