Breaking News

వెస్టిండీస్ క్రికెటర్లు వచ్చేశారు..


మాంచెస్టర్‌: అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు ఇంగ్లండ్, వెస్టిండీస్ మరో అడుగు ముందుకేశాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ కోసం విండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టింది. కరోనా నేపథ్యంలో మరో జట్టు వేరే దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. రిజర్వ్ టీమ్, సహాయక సిబ్బంది మొత్తం మాంచెస్టర్ చేరుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉన్న ఆటగాళ్లందర్ని రెండు ప్రైవేట్ విమానాల్లో అంటిగ్వాకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అక్కడి నుంచి స్పెషల్ విమానాల్లో మాంచెస్టర్ కు తీసుకెళ్లారు. మరోసారి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ లో ఉంచనున్నారు. జులై 8 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించే మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు.