Breaking News

వెనక్కి తగ్గిన చైనా

వెనక్కి తగ్గిన చైనా

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌ విషయంలో చర్చలు జరిగిన తర్వాత చైనా సైన్యం వెనక్కి వెళ్లిపోతోందని అధికార వర్గాలు సమాచారం. స్పెషల్‌ రిప్రజంటేటివ్‌ చర్చల తర్వాత చాలా చోట్ల దాదాపు 2 కి.మీ. దూరం వెనక్కి వెళ్లినట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. పెట్రోల్‌ పాయింట్‌ 17ఏ వద్ద నుంచి కూడా గురువారం లేదా శుక్రవారం సైన్యం వెళ్లిపోతుందని అన్నారు. ఇప్పటికే పాంగ్వాంగ్‌ లేక్‌, ఫింగర్‌‌ 4 ఏరియాలో ఇప్పటికే టెంట్లు తీసేసి, వెహికిల్స్‌ కూడా తరలించారన్నారు.

ఇండియా– చైనా సైన్యానికి మధ్య గొడవ జరిగిన ప్రదేశమైన గాల్వాన్‌ లోయ వద్ద నుంచి సైనికులు వెళ్లిపోయినట్లు శాటిలైట్‌ ఫొటోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ లడాఖ్‌లోని గాల్వాన్‌ వ్యాలీ, హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా, ఫింగర్స్‌ రీజన్‌లను రెండు దేశాల సైన్యాలు వెనక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.