సారథి న్యూస్, కల్వకుర్తి: ట్రూ టీచర్స్ కోయెలేషన్ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం గాజర గ్రామంలో శుక్రవారం విలేజ్ లెర్నర్స్ సర్కిల్ ను సర్పంచ్ కొమ్ము లక్ష్మమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చదువులకు దూరమవుతున్న పిల్లల కోసం విద్యాకేంద్రం ప్రారంభించి, చదువు చెప్పించడం శుభపరిణామమన్నారు. సర్కిల్ కు అన్నివిధాలుగా సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ట్రూ టీచర్స్ కోయెలేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెకంటి మల్లయ్య స్వేరో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పేదపిల్లలు నాణ్యమైన చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే విలేజ్ లెర్నర్ సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి విద్యార్థికి నచ్చిన పాఠ్యాంశాలు బోధిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చింతకుంట్ల సైదులు, విద్యాకమిటీ చైర్మన్ కామాటి సైదులు, మాజీ సర్పంచ్ పిల్లి నారాయణ స్వేరో, నాయకులు నిరంజన్ యాదవ్, కొమ్ము వెంకటేష్ యాదవ్, దుడ్డు మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.