లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్‌కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్, రూ.794 కోట్లు), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా, రూ.786 కోట్లు) రెండు, మూడు స్థానాలను సాధించారు. మొత్తం 100 మంది జాబితాలో 35 మంది బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఉండడం విశేషం.
- May 30, 2020
- Top News
- క్రీడలు
- FORBES
- TEAMINDIA
- VIRATKOHLI
- టీమిండియా
- ఫోర్బ్స్
- రోజర్ ఫెదరర్
- విరాట్‌కోహ్లీ
- Comments Off on విరాట్ @ రూ.196 కోట్లు