Breaking News

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.