Breaking News

వానాకాలంలో మక్కలు వేయొద్దు

అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్

సారథి న్యూస్, రామాయంపేట: వానాకాలం సీజన్ లో రైతులు మక్క పంటను సాగు చెయొద్దని, సీఎం కేసీఆర్ చెప్పినట్లు నియంత్రిత పంటల విధానం పాటించాలని రామాయంపేట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ సూచించారు. బుధవారం మండలంలోని నస్కల్ గ్రామంలో రైతులకు నియంత్రిత పంటల విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు మక్క పంటను అసలు సాగుచేయొద్దని, వేసేవారికి రైతుబంధు స్కీం వర్తించదని చెప్పారు. సన్నరకం వరికి డిమాండ్ వస్తుందని, మంచి రేటుకు అమ్ముడు పోతుందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కరెయ్య, ఎంపీపీ సిద్ధరాములు, నస్కల్ సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ సంపత్ పాల్గొన్నారు.