- బీజేపీ నేతల వినతి
సారథి న్యూస్, నర్సాపూర్: సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు తీర్చాలని మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసులో శనివారం బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, రాకేశ్ వినతిపత్రం అందజేశారు. టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. రాజేందర్, రాకేష్ ,రాజు పాల్గొన్నారు