సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు.
బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 17 రకాల పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చాయని గుర్తుచేశారు. సమావేశంలో డీఆర్వో స్వర్ణలత, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్, డీఎంహెచ్ వో డాక్టర్ కృష్ణ, డాక్టర్ శశికాంత్, ఆర్టీసీ పాల్గొన్నారు.