వలస కార్మికులకు చేయూత..
జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లో..
సారథి న్యూస్, నర్సాపూర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లోని
వారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న కూలీలకు బుధవారం శివ్వంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ
సభ్యుడు మహేష్ గుప్తా తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.రెండువేల నగదుతో పాటు పిల్లలకు బిస్కెట్
ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.