Breaking News

వర్మకు కౌంటర్​

సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్​కల్యాణ్​పై ‘పవర్​స్టార్’​ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్​ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్​ ఓ రేంజ్​లో వైరల్ అవుతుంది. దీంతో పవన్​ఫ్యాన్స్​ రాంగోపాల్​వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస పడిపోతున్నారు. కాగా తాజాగా పవన్​కల్యాణ్ అభిమాని, బిగ్​బాస్​ ఫేం నూతన్​నాయుడు పవర్​స్టార్​కు కౌంటర్​గా ఓ చిత్రాన్ని తీస్తున్నట్టు ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశాడు. ఈ పోస్టర్​ అచ్చం ఆర్జీవీ సినిమాలను పోలి ఉంది. దీంతో పవన్​కల్యాణ్​ అభిమానులు కూడా కొంత ఆనందంగానే ఉన్నారు. షకలక శంకర్ ఈ సినిమాలో లీడ్​ రోల్​ పోషిస్తున్నట్టు టాక్​. అసలు ఈ సినిమా తెరకెక్కుతుందో లేదా మధ్యలో ఆగిపోతుందో వేచి చూడాలి. గానీ ఇది ఆర్జీవి పవర్​స్టార్​ చిత్రానికి కౌంటర్​గా నిలబడుతుందని పవన్​కల్యాణ్​ అభిమానులు సంబరపడుతున్నారు.