Breaking News

వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన హెల్త్​ కండీషన్​ ఉన్నట్టుండి క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబసభ్యులు ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతి ఇచ్చారు.

వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్​ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక పిలుపు మేరకు వరవరరావు సతీమణి హేమలత, ఆయన కుమార్తె పవన శుక్రవారం ఇఫ్లూ యూనివర్సిటీలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. వారికి మద్దతు తెలంగాణ రాష్ట్రాల్లో రెండొందల ప్రాంతాల్లో నిరసన తెలియజేసినట్లు వేదిక కన్వీనర్​ ప్రొఫెసర్​ హరగోపాల్​ తెలిపారు.