సారథి న్యూస్, ఖమ్మం: నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మున్నేరు కాల్వ ఉధృతంగా ప్రవహించడంతో నిర్వాసితులైన ప్రజలకు ఖమ్మం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపు ఏర్పాటుచేశారు. ఆదివారం మంత్రి పువ్వాడ అజయ్ నిర్వాసితులను కలిసుకొని వారితో మాట్లాడారు. నిర్వాసితులతో ధైర్యం చెప్పారు. అనంతరం మంత్రి మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. నిర్వాసితుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు సూచించారు.
- August 16, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KAMMAM
- MINISTER
- MUNNERU
- PUVVADA AJAY
- RAINS
- ఖమ్మం
- మంత్రి పువ్వాడ
- వరదబాధితులు
- Comments Off on వరద బాధితులను ఆదుకుంటాం