Breaking News

వరంగల్ సీపీకి ఆత్మీయ సన్మానం

వరంగల్ సీపీకి ఆత్మీయ సన్మానం

సారథి న్యూస్​, వరంగల్​: హన్మకొండ సీఎస్ఆర్​ గార్డెన్స్ లో సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్​ రవీందర్ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్​ మాట్లాడుతూ.. పోలీస్​ కమిషనర్​గా డాక్టర్​ రవీందర్​ వరంగల్​ నగరానికి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర సమయంలో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సీపీ డాక్టర్​ రవీందర్​ మాట్లాడుతూ..వరంగల్​లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరూ ఎంతో సహకరించారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మేయర్ గుండా ప్రకాష్ రావు, వరంగల్ జడ్పీచైర్మన్​​ సుధీర్​బాబు, కుడా చైర్మన్​ మర్రి యాదవ​రెడ్డి, ఎమ్మెల్యేలు సన్నపనేని నరేందర్​, ఆరూరి రమేష్​, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్​ తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.