Breaking News

లుక్ అదిరింది

లుక్ అదిరింది

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షిసిన్హా అంటే తెలియకున్నా ‘దబాంగ్’ హీరోయిన్ అంటే మాత్రం చాలా మంది గుర్తుపడతారు. అయితే సోనాక్షి ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్’ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్ తో హాట్ సోనాక్షి కాస్త ఐరెన్ లేడీగా చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, సంజయ్ దత్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

1971లో ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో సుందర్ బెన్ జేత మధర్ పర్య తన సామాజిక కార్యకర్తలతో 299 మందితో కలిసి భారత ఆర్మీకి సహకారం అందించారు. ఆమె అందించిన సేవకు గాను అప్పటి ప్రభుత్వం ప్రశంసలతో ఆమెను ముంచెత్తింది. ఆ కథాంశంతోనే ఇప్పుడీ చిత్రం రూపొందుతోంది. ఆమె పాత్రనే సోనాక్షి సిన్హా పోషిస్తుంది. ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రణీత కూడా కీలక పాత్ర చేస్తోంది. అభిషేక్ దుధైయ దర్శకత్వం వహించిన.. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.