సారథి న్యూస్, రామడుగు: సంప్రదాయ సాగు లాభసాటిగా లేకపోవడంతో.. డిమాండ్ ఆధారిత పంటలను పండిచడంతో మంచి ఆదాయం వస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను వేయాలని రైతులను కోరారు. బుధవారం తిర్మలాపూర్, రాంచంద్రపూర్ గ్రామాల్లో రైతులు కట్ల శ్రీనివాస్, ధ్యావ రాంచందర్‌రెడ్డి సాగుచేసిన డ్రాగన్ ఫ్రూట్, అంజిరా తోటలను వారు పరిశీలించారు.
ఆరోగ్యాన్ని పెంపొందించే బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అరటి, ద్రాక్ష తోటలపై రైతులు మొగ్గుచూపాలని కోరారు. అల్లం, ఉల్లిపాయలు, కూరగాయల పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి పాల్గొన్నారు.