సారథి న్యూస్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనగార్డెన్స్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ స్థాయి వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై గురువారం రైతులు, అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
లాభం వచ్చే పంటలను మాత్రమే వేయాలని రైతులను కోరారు. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. తెలంగాణ సోనారకం వరిని సాగుచేయాలన్నారు. నారాయణపేట జిల్లా జజాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ‘జజాపూర్ క్లస్టర్ రైతువేదిక’ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.