Breaking News

లాక్​డౌన్​ ప్రకటించండి

సింగరేణి లాక్​డౌన్​

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో లాక్​డౌన్​ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వై గట్టయ్య, సీఐటీయూ రామగుండం రీజియన్ నాయకుడు ఉల్లి మొగిలి, ఐఎన్​టీసీ ప్రధాన కార్యదర్శి బీ జనక్ ప్రసాద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, బీఎంఎస్​ అధ్యక్షుడు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.